ఆంధ్రప్రదేశ్

కేకేపై వెంకయ్యనాయుడికి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

కేకేపై వెంకయ్యనాయుడికి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
X

టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఢిల్లీలో కలిశారు. మున్సిపల్ ఛైర్మన్‌ ఎన్నికల్లో కేకే ఎక్స్ అఫిషియో ఓటేశారని ఆయన పై చర్యలు తీసుకోవాలని కోరారు. కేకే ఏపీకి ప్రాతినిథ్యం వహిస్తున్న కోటా ఎంపీగా ఉన్నారని బీజేపీ నేతలు ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇష్టాను సారం వ్యవహరించిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు.

Next Story

RELATED STORIES