అన్నదాతకు వరాలు ప్రకటించిన నిర్మలా సీతారామన్

2020-21 బడ్జెట్ ప్రవేశపెట్టిన.. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగం మొత్తం రైతుల చుట్టూ తిరుగుతుంది. ఈ బడ్జెట్ లో ఆమె అన్నదాతలకు వరాలు ప్రకటించారు. సాగు, వ్యవసాయ రంగానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు 16 సూత్రాల కార్యాచరణ ప్రకటించింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. 6.1 కోట్ల మంది రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అందిస్తున్నామన్నారు. వ్యవసాయంలో పోటీ తత్వం పెంచడమే తమ లక్ష్యమనీ.. వ్యవసాయంలో పెట్టుబడి లాభదాయకం కావాలని ఆమె పేర్కొన్నారు. కేంద్ర చట్టాలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. వ్యవసాయ రంగానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ధాన్యలక్ష్మి పథకానికి ముద్ర, నాబార్డ్ సాయం అందిస్తాయని అన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి.. సేంద్రీయ ఎరువుల వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకుంటామదని.. సేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న 100 జిల్లాలకు ప్రయోజనం కలిగించేలా ఆలోచిస్తున్నామని.. సౌరశక్తి ద్వారా పంపుసెట్ల నిర్వహణకు ప్రోత్సాహకాలు ఇస్తామని అన్నారు. కొత్తగా 15లక్షల మంది రైతులకు సోలార్ పంపులు అందిస్తామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com