పన్ను చెల్లింపుదారులకు తీపికబురు

జాతీయ భద్రతకే ప్రభుత్వం ప్రాధాన్యమని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు. పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి వేధింపులు ఉండవని.. పన్ను ఎగవేత ఇక క్రిమినల్ నేరం కాదని తెలిపారు. త్వరలో చట్ట సవరణ చేస్తామన్నారు.
మరోవైపు ఆదయపు పన్ను వివరాలు కూడా తెలియజేస్తు.. పన్ను చెల్లింపుదారులకు తీపికబురు తెలియజేశారు. ఆదాయం 5 లక్షల నుంచి 7.5 లక్షలు ఉన్నవారికి 10శాతం పన్ను విధిస్తున్నట్టు తెలిపారు. 7.5 లక్షల నుంచి 10 లక్షలు ఉన్నవారికి 15గా ఉంటుందని.. 10 లక్షల నుంచి 12.5 లక్షలు ఉన్నవారికి 20శాతం పన్ను విధిస్తున్నట్టు తెలిపారు. 12.5 లక్షల నుంచి 15 లక్షలు ఆదాయం ఉన్న వారికి 25శాతం ట్యాక్స్.. 15 లక్షలు పైబడిన వారికి మాత్రమే.. 30 శాతం ట్యాక్స్ వసూలు చేస్తున్నట్టు తెలిపారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com