ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి.. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది: నిర్మలా సీతారామన్

ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి.. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది: నిర్మలా సీతారామన్

లోక్‌‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది సామాన్యుల బడ్జెట్‌ అని ఆమె అన్నారు. దేశ ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో బడ్జెట్‌ను తీసుకొచ్చామని.. జాతి నిర్మాణంలో యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పాత్ర కీలకమని తెలిపారు.

గత ఎన్నికల్లో మోదీ నాయకత్వానికి భారీ మెజార్టీతో అధికారం అప్పగించిన ప్రజల భాగస్వామ్యంతో దేశాన్ని అభివృద్ధి చేసేందుకు పనిచేస్తున్నామని నిర్మల తెలిపారు. ఆదాయాల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్‌ ను తయారు చేశామని అన్నారు. యువతను కీలకం చేసేలా ప్రభుత్వ ప్రాధమ్యాలు ఉంటాయని.. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకెళ్తుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని.. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని ఆమె అన్నారు. నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం అని ఆర్థిక మంత్రి వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story