కాకినాడలో కరోనా వైరస్ కలకలం

కాకినాడలో కరోనా వైరస్ కలకలం

కరోనా వైరస్ పట్ల ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖాధికారులతో మంత్రి ఆళ్ల నాని మాట్లాడారు. జిల్లాలు వారిగా నోడల్ ఆఫీసర్స్ ను నియమించినట్లుగా తెలిపారు మంత్రి నాని. విమానాశ్రయాలు, పోర్టు లలో కరోనా వైరస్ గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు ప్రభుత్వం చేపట్టిందన్నారు. అందుబాటులో స్కానింగ్ పరికరాలు, మాస్క్ లు ఏర్పాటు చేయాలని అధికారాలకు మంత్రి ఆదేశించారు.

ఇదిలావుంటే, కాకినాడలో కరోనా కలకలం రేగింది. చైనాలో వైద్య విద్య అభ్యసస్తున్న ఇసాక్ మహమ్మద్‌ ఇమ్రాన్ అనే విద్యార్థి జనవరి 16న కాకినాడకు వచ్చాడు. అయితే, అనుమానితుడిగా గుర్తించిన వైద్య అధికారులు.. అతనికి పరీక్షలు నిర్వహించారు. 28 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో వుండాలని సూచించారు. ఇప్పటివరకు అతను ఆరోగ్యంగా వున్నట్టు జిల్లా వైద్య అధికారులు తెలిపారు.

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో చైనా దేశస్తులను చూసి విమానాశ్రయ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చైనాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా చైనీయులు కనిపించడంతో ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందికి ఏం చేయాలో అర్ధం కాలేదు. TCL కంపెనీలో శిక్షణ పూర్తి చేసుకుని నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న చైనీయులు.. అక్కడి నుంచి చెన్నై వెళ్లేందుకు తిరుపతి చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో.. తిరుపతి నుంచి బయలుదేరాల్సిన చెన్నై ఫ్లైట్‌ ఆలస్యం కావడంతో తిరుపతి పరిసరాలను చూసేందుకు చైనీయులు విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు. అయితే.. చైనీయులను చూసిన టాక్సీ డ్రైవర్లు కరోనా వైరస్‌కు భయపడి వారినెవరూ తమ వాహనాల్లో ఎక్కించుకోలేదు. అయితే, వీరు చైనా నుంచి రాలేదని తెలుసుకుని అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story