ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ ఇస్తాం: నిర్మలా సీతారామన్

ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ ఇస్తాం: నిర్మలా సీతారామన్
X

భారత నెట్‌ ద్వారా ప్రతి ఇంటికి ఫైబర్‌ నెట్‌ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగంలో మట్లాడిన ఆమె.. ఇంటర్నెట్ గురించి మాట్లాడుతూ.. లక్ష పంచాయతీలకు ఇప్పటికే ఫైబర్‌ నెట్‌ కనెక్షన్ అందిస్తున్నామని.. త్వరలోనే ప్రతి ఇంటికి ఇస్తామన్నారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఆర్థికరంగ స్వరూపాన్నే మార్చేస్తున్నాయన్నారు.

డేటా సెంటర్‌ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని.. పోటీ తట్టుకొని అవకశాలు అందుకునేందుకు ఉపయోగపడతాయని నిర్మలసీతారామన్ తెలిపారు. మూలకణ వైద్యవిధానం అభివృద్ధి కోసం డేటా బేస్‌ని ఏర్పాటు చేస్తామన్నారు. క్వాంటమ్‌ టెక్నాలజీస్‌ అప్లికేషన్‌ కోసం రూ.8 వేల కోట్లు కేటాయిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.

Tags

Next Story