రైల్వేశాఖ సాయంతో డిమాండ్-సరఫరా మధ్య అంతరాన్ని తగ్గిస్తాం: నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత రైల్వేలపై కీలక ప్రకటన చేశారు. 27000 కిలోమీటర్ల మేర భారత రైల్వే ట్రాక్‌లను విద్యుదీకరిస్తామని.. దీంతో డిమాండ్-సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించవచ్చు అని తెలిపారు. రైల్వేలకు సౌరవిద్యుత్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇందుకోసం రైల్వే స్వాధీనంలో ఉన్న ట్రాక్‌ల పొడవునా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆమె అన్నారు. దేశంలోని మరిన్ని పర్యాటక ప్రాంతాలకు కూడా తేజస్ వంటి రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చి.. పర్యాటక రంగాన్ని అభివృద్ది చేస్తామని అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రవాణా మౌలిక సదుపాయాల కోసం రూ.1.7 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మల పేర్కొన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను 2023 నాటికల్లా పూర్తిచేస్తామని ఆమె తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com