ఘనంగా పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

ఘనంగా పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రాజస్థాన్‌ యూనివర్శిటీ మాజీ వైస్‌ ఛాన్స్‌లర్‌ గెహ్లాట్‌ హజరయ్యారు. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసుకున్న దాదాపు 400 మంది విద్యార్ధులు గవర్నర్‌ చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన గవర్నర్‌ తమిళసై... ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నోరులేని జీవులకు వైద్యం అందిస్తున్నందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలకు వెళ్లి మరింత విస్తృతంగా సేవలు అందించాలని కోరారు గవర్నర్‌. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిపెట్టిందని, పెద్దఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story