ఇక ఆన్‌లైన్‌లోనే డిగ్రీ చేసుకునే అవకాశం

ఇక ఆన్‌లైన్‌లోనే డిగ్రీ చేసుకునే అవకాశం
X

డిగ్రీ చదవాలనుకునే వారికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. నూతన విద్యా విధానం ద్వారా ఇక నుంచి డిగ్రీ ఆన్‌లైన్‌లోనూ చదువుకునే అవకాశం కల్పిస్తున్నట్లు శనివారం లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. దేశంలో ముందంజలో ఉన్న 100 జాతీయ విద్యాలయాల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. దేశంలో జాతీయ పోలీస్ విశ్వవిద్యాలయం, జాతీయ ఫోరెనిక్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా పేర్కొన్నారు.

ఇక భారత్‌లో చదువుకునే విదేశీ విద్యార్థుల కోసం ‘ఇండ్‌శాట్’ అనే పేరుతో నూతన విద్యా విధానం తీసుకురానున్నట్లు నిర్మలా పేర్కొన్నారు. అంతే కాకుండా విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు.

Tags

Next Story