31 Jan 2020 7:39 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / అమరావతి రైతుల దీక్షా...

అమరావతి రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన వైసీపీ ఎంపీ

అమరావతి రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన వైసీపీ ఎంపీ
X

అమరావతిలో ఉద్యమ సెగలు ప్రజ్వరిల్లుతున్నాయి. 45వ రోజూ 29 గ్రామాలు హోరెత్తిపోతున్నాయి. అయితే తొలిసారిగా అమరావతి దీక్షా శిబిరాన్ని వైసీపీ నేత సందర్శించారు. వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు మందడంలో రైతులతో మాట్లాడారు. భూములు ఇచ్చిన రైతులెవరికీ అన్యాయం జరగదన్నారు. ప్రభుత్వ కమిటీ వచ్చి అందరి అభిప్రాయాలు తీసుకుంటుందని.. అప్పుడు రైతులంతా తమ ఇబ్బందులు తెలియజేయాలని చెప్పారు ఎంపీ కృష్ణదేవరాయలు.

అయితే అమరావతిని కొనసాగిస్తూ తమతో చర్చలకు రావాలని రైతుల డిమాండ్ చేశారు. అమరావతికి అనుకూలమా కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ కృష్ణదేవరాయలు మాట్లాడుతుండగానే నినాదాలతో హోరెత్తించారు రైతులు.

Next Story