నెల్లూరు జిల్లాలో వివాదాస్పదంగా మారుతున్న వైఎస్ఆర్ గృహకల్పన పథకం

నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ గృహకల్ప రగడ వివాదంగా మారుతోంది. పేదల ఇళ్ల కోసమంటూ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఓ నిరుపేద రైతు పంటను పీకేశారు రెవెన్యూ సిబ్బంది. ఈ ఘటన వాకాడు మండలం కల్లూరు గ్రామంలో జరిగింది. వెంకటసుబ్బయ్య అనే పేద రైతు.. 70 సెంట్ల ప్రభుత్వ భూమిలో గత 40 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే.. వైఎస్ఆర్ గృహకల్పన కింద ఈ స్థలాన్ని తీసుకోవాలని నిర్ణయించారు అధికారులు. దీంతో రెండునెలలున్న వరి పంటను పీకేశారు. దీనిపై రైతు వెంకటసుబ్బయ్య.. గూడూరు రెవెన్యూ అధికారి దృష్టికి తీసికెళ్లాడు. అయితే.. ప్రభుత్వ స్థలంలో ఎవరున్నా క్రిమినల్ కేసులు పెడతామంటూ బెదిరించడంతో.. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆందోళనకు దిగాడు రైతు వెంకట సుబ్బయ్య. పెద్దపెద్ద బడాబాబులు, రాజకీయనేతలకు జోలికి వెళ్లకుండా తమ జోలికి వస్తే ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు రైతు వెంకటసుబ్బయ్య.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com