ఆంధ్రప్రదేశ్

అసరవల్లిలో అంగరంగ వైభవంగా రథ సప్తమి వేడుకలు

అసరవల్లిలో అంగరంగ వైభవంగా రథ సప్తమి వేడుకలు
X

అరసవల్లి సూర్యనారాయణ క్షేత్రంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు లక్షలాది భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. ఆరోగ్య ప్రధాత అయిన స్వామిని దర్శించుకోనేందుకు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఒడిస్సా, చత్తీష్ గడ్ ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. విశాఖ శారాధ పీఠం ఉత్తరాదికారి స్వామి శ్రీ శ్వేత్మానంధ ఆనవాయితీగా పట్టువస్త్రాలు సమర్చించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, స్థానిక మంత్రి ధర్మాన కృష్ణదాస్ తో పాటు ఆలయ అధికారులు కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మహాభిషేకంలో మంత్రలతో పాటు ఎపి శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.

అటు కలియుగ వైకుంఠం తిరుమలలో కూడా రథ సప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీమలయప్ప స్వామి వారు.. సప్త వాహనాలపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు.. కల్పవృక్ష వాహనంపై విహరించారు. కన్నుల పండువగా సాగిన ఈ వేడుకును చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో తిరుమల మాఢవీధులు కిక్కిరిసిపోయాయి. కామితార్థ ప్రదాయినిగా కల్పవృక్ష వాహనానికి పురాణాల్లో ఓ విశిష్టస్థానం వుంది. అలాంటి కల్పవృక్షాన్ని సైతం తన వాహనంగా చేసుకున్న శ్రీవారిని దర్శించుకుని భక్తులు తరించారు.

అనంతరం శ్రీనివాసుడు సర్వభూపాల వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఉరేగారు. అత్యంత వైభవంగా సాగిన వేడుకతో తిరుమల ఇల వైకుంఠాన్ని తలపించింది. భక్తుల గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మారుమోగాయి. సర్వభూపాల వాహనంలో కొలువైన స్వామిని దర్శిస్తే.. రాజ్యసుఖ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అనంతరం శ్రీవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఊరేగించినట్టుగానే.. రథసప్తమి రోజున కూడా శ్రీవారిని.. ఒకే రోజు అన్ని వాహనాలపై ఊరేగిస్తారు.

పద్మావతి అమ్మావారు కొలువైన తిరుచానూరులోనూ రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. గోవింద నామస్మరణ మధ్య వాహనసేవ వైభవోపేతంగా నిర్వహించారు. తిరుచానూరుతో పాటు.. తిరుపతిలోని గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కూడా రథ సప్తమి వేడుకలు కన్నుల పండువగా సాగాయి.

శ్రీశైలంలోకూడా రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయ. అక్కమహాదేవి అలంకార మండపంలో సూర్య సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని పూజలు నిర్వహించారు.

నిజామాబాద్ జిల్లాలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని నీలకంఠ ఆలయం వద్ద రథోత్సవం అంగరంగవైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయం ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది.

Next Story

RELATED STORIES