సిద్ధిపేట ప్రజలంతా ఆరోగ్యంగా వుంటేనే నాకు సంతోషం : హరీష్ రావు

సిద్ధిపేట ప్రజలంతా ఆరోగ్యంగా వుంటేనే నాకు సంతోషం : హరీష్ రావు

సిద్ధిపేట ప్రజలు ఆసుపత్రికి వెళ్లుకుండా వున్నప్పుడే.. తనకు సంతోషమన్నారు మంత్రి హరీష్ రావు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని 5వ వార్డులో.. రూ.25 లక్షలతో తలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక లాల్ కమాన్ వద్ద.. తన షాపు ముందు చెట్టును సుందరంగా తీర్చిదిద్ది సంరక్షిస్తున్న ఓ వ్యాపారిని.. శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సుందర సత్సంగ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆరోగ్య సిద్ధిపేట సాధనే తమ లక్ష్యమని అన్నారు. ఇందుకు సిద్ధిపేట ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story