న్యూజిలాండ్ పై విజయం.. భారత్ క్లీన్ స్వీప్..

న్యూజిలాండ్ పై విజయం.. భారత్ క్లీన్ స్వీప్..

న్యూజిలాండ్ పై జరిగిన ఐదో టీ20 లోను భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. మౌంట్‌మాంగలో జరిగిన ఈ చివరి టీ20లో టీమిండియా 164 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ జట్టు కేఎల్‌ రాహుల్‌(45; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), రోహిత్‌ శర్మ(60 రిటైర్డ్‌ హర్ట్‌; 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో పాటు శ్రేయస్‌ అయ్యర్‌(33 నాటౌట్‌; 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.

అనంతరం బరిలోకి దిగిన కివీస్ జట్టు 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. దీంతో 7 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. టిమ్ సిఫర్ట్(50), రాస్ టేలర్(53) మినహా అందరూ విఫలమయ్యారు. న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. భారత బౌలర్లు బుమ్రా(3), నవదీప్ సైని, శార్ధూల్ ఠాకూర్ లు చెరో రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు.

Tags

Read MoreRead Less
Next Story