రెండు రోజుల పర్యటనకు హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు

రెండు రోజుల పర్యటనకు హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు

రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వాగతం పలికారు. అనంతరం నేరుగా రాజ్ భవన్ కు చేరుకున్న రాష్ట్రపతి దంపతులు.. ఈ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా నందిగామలో ఇటీవల నిర్మించిన కన్హా శాంతివనాన్ని సందర్శింస్తారు. అనంతరం ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Tags

Read MoreRead Less
Next Story