మహారాష్ట్రలో 'ఎన్‌ఆర్‌సి' ని అమలు చేయం : సీఎం ఉద్దవ్ థాకరే
మహారాష్ట్రలో 'ఎన్‌ఆర్‌సి' ని అమలు చేయమని సీఎం ఉద్దవ్ థాకరే మరోసారి స్పష్టం చేశారు. శివసేన మౌత్ పీస్ సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ స్పష్టం చేశారాయన. శివసేన ఎంపి సంజయ్ రౌత్ ఠాక్రేను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్బంగా ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. 'పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పౌరసత్వాన్ని తీసివేయడానికి కాకుండా.. ఇవ్వడం గురించి ఆలోచించాలని.. ఎన్‌ఆర్‌సి అమలు చేస్తే, హిందువులు, ముస్లింలు ఇద్దరికీ పౌరసత్వం నిరూపించడం కష్టం.
అందుకే దీనిని అమలు చేయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంతేకాదు హిందుత్వ భావజాలాన్ని శివసేన విడిచిపెట్టలేదని స్పష్టం చేశారు. కాగా అంతకుముందు లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు(caa)పై శివసేన మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాజ్యసభలో ఓటింగ్ సమయంలో శివసేన సభ నుండి బయటకు వెళ్ళిపోయింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com