ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు బలపడతాయి : విష్ణువర్ధన్ రెడ్డి

ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు బలపడతాయి : విష్ణువర్ధన్ రెడ్డి
X

ఏపీలో బీజేపీ, జనసేన బలమైన పార్టీలుగా ఎదుగుతాయన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ ను వాడుకున్న కమ్యూనిస్టులు.. బీజేపీతో జతకడితే రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులపై జగన్ సర్కార్ దుందుడుకు వైఖరి సరైంది కాదన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడిగా దయాకర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Tags

Next Story