విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి ఏర్పాట్లు ముమ్మరం

విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి ఏర్పాట్లు ముమ్మరం

అమరావతి ప్రజల ఆశయాలను తుంగలోకి తొక్కి.. విశాఖలో కార్యనిర్వహక రాజధాని ఏర్పాట్లలో నిమగ్నమైంది వైసీపీ ప్రభుత్వం. రాజధాని తరలింపు పై హైకోర్టులో విచారణ ఇంకా పూర్తికాలేదు. కానీ, అధికారులు మాత్రం చాపకింద నీరులా అతిథి గృహాలకు మెరుగులద్దే పనిలో బిజీగా వున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలకు కార్యాలయాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

సాగర్ నగర్ కు సమీపంలోని బీచ్ ఫ్రంట్ లో నిర్మాణమవుతున్న.. ఓ హోటల్ లో కొంతభాగాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్ గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రతిపాదిత రాజధానికి దగ్గరలో వుండటంతో ఈ హోటల్ ను క్యాంప్ ఆఫీసుకుగా ఎంచుకునట్టు సమాచారం. ఇంతకుముందు ఇక్కడ కార్తీకవనం అనే ఉద్యానవనం ఉండేది. నిజానికి ఇది సి.ఆర్.జెడ్. జోన్ కిందకు వస్తుంది. అయినా, హోటల్ నిర్మాణానికి అనుమతిచ్చారు.

ఇక, కొద్ది నెలలుగా ఖాళీగా వుంటున్న.. ఆంధ్రాయూనివర్సిటీలోని వీసీ బంగ్లాను గవర్నర్ నివాస గృహంగా వాడేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఈ భవనానికి మరమ్మత్తులు చేస్తున్నారు.

ఇదిలావుంటే, మధురవాడలో డీజీపీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, విశాలాక్షి నగర్ లోఎంపీ విజయసాయి రెడ్డికి కూడా క్యాంప్ ఆఫీస్ రెడీ చేస్తున్నట్టు సమాచారం.

Tags

Next Story