ఆంధ్రప్రదేశ్

విలీన మండలాల్లో మద్యం తోపాటు ఏరులై పారుతోన్న నాటు సారా

విలీన మండలాల్లో మద్యం తోపాటు ఏరులై పారుతోన్న నాటు సారా
X

తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాల్లో తెలంగాణ మద్యం తోపాటు నాటు సారా ఏరులై పారుతోంది. నాలుగు మండలాల్లో ఏ గ్రామంలో చూసినా బెల్ట్‌ షాపులు దర్శనమిస్తున్నాయి. ఒక పక్క ప్రభుత్వం దశల వారీగా మద్యపాన నిషేదాన్ని అమలు చేయాలని ప్రత్నిస్తుంటే మరో వైపు కొందరు దళారులు అధికారుల అండదండలతో తెలంగాణ మద్యాన్ని బెల్ట్‌ షాపులకు సరఫరా చేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా తాగి తమ భర్తలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బెల్ట్‌ షాపుల కట్టడి చేయాల్సిన అధికారులు కంటి తుడుపుకు కేసులు నమోదు చేస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. అసలు దొంగలను వదిలిపెట్టి అక్రమ రవాణాకు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లిపాకలో అక్రమ మద్యంతో పాటు నాటు సారా, నల్లబెల్లం షాపులకు సరఫరా చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఒకవైపు తెలంగాణ మద్యం, మరోవైపు నాటు సారాతో తమ జీవితాలు నాసనమవుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ షాపులన్నింటికి యటపాక మండలానికి చెందిన ఓ లిక్కర్‌ డాన్‌.. అధికారుల అండదండలతో తెలంగాణ మద్యాన్ని విచ్చవిడిగా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నెల్లిపాకలో కాకినాడ్‌ ఎక్సైజ్‌ అధికారులు ఇటీవల జరిపిన దాడుల్లో దాదాపు 1900 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో మద్దినేని వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అయినా... మద్యం సరఫరా ఆగలేదు. అటు ఎటపాక మండలం కాపవరంలో జరిగిన ఎక్సైజ్‌ అధికారుల దాడుల్లో ఏకంగా 1100 తెలంగాణ మద్యం బాటిళ్లు దొరికాయి.

ఇంత జరుగతున్నా.. ఎక్సైజ్‌ అధికారులు మాత్రం అంటీముట్టనట్లు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిక్కర్‌ డాన్‌తో పాటు ఇతర అక్రమ మద్యం వ్యాపారులు... ఎక్సైజ్‌ అధికారులతో చేతులు కలిపినట్లు ఆరోపిస్తున్నారు స్థానికులు. అందుకే.. బెల్ట్‌షాపులు, అక్రమ మద్యం నిల్వలపై సమాచారం ఇచ్చినా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా.. ఎక్సైజ్‌ అధికారులు తెలంగాణ మద్యాన్ని, బెల్ట్‌షాపులను అరికట్టాలని కోరుతున్నారు.

Next Story

RELATED STORIES