ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలవనున్న అమరావతి జేఏసీ నేతలు

ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలవనున్న అమరావతి జేఏసీ నేతలు

మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు.. అన్న నినాదాలతో అమరావతి ప్రాంతం హోరెత్తిపోతోంది. తుళ్లూరు, మందడం, వెలగపూడితో పాటు పలు గ్రామాల్లో రైతులు 48వ రోజు కూడా పోరాటం కొనసాగిస్తున్నారు. తమ ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. అసలు తాము ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నామా అని ప్రశ్నిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని అంటున్నారు.

మరోవైపు అమరావతి రైతులకు జరగుతున్న అన్యాయాన్ని వివరించేందుకు జేఏసీ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తమ గోడును చెప్పుకునేందుకు.. జేఏసీ నేతలు సిద్ధమైంది.

Tags

Next Story