8 ఏళ్లు గడిచిపోయాయి.. ఉరి ఇంకెప్పుడు?

8 ఏళ్లు గడిచిపోయాయి.. ఉరి ఇంకెప్పుడు?

2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనతో యావత్ దేశమూ కన్నీరుపెట్టింది. ఘటన జరిగి 8 ఏళ్లు గడిచిపోయాయి. అయినా దోషులు ఇంకా చట్టం కళ్లు కప్పి తప్పించుకు తిరుగుతూనే ఉన్నారు. నిర్భయపై సామూహిక హత్యాచారం కేసులో వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా, ముఖేష్‌ సింగ్‌, అక్షయ్‌ సింగ్‌ దోషులుగా తేలారు. జనవరి 22నే వీరికి ఉరిశిక్ష అమలు చేయాల్సింది కానీ.. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో అది కాస్త వాయిదా పడింది.. మళ్లీ ఫిబ్రవరి 1న అదే జరిగింది.. ఈసారి సేమ్ ట్రిక్ ప్లే చేశారు. నిందితులు ఈసారి మరొకడు క్షమాభిక్షకు అర్థించడంతో ...మళ్లీ ఉరిని వాయిదా వేశారు..

చట్టంలో లొసుగుల్ని అడ్డం పెట్టుకొని శిక్షను వాయిదా వేయిస్తున్న దోషులకు తగిన బుద్ధి

చెప్పాలనుకున్న కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది..ఉరిశిక్ష అమలుపై పటియాలా

కోర్టు స్టే విధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆదివారం విచారణ జరిగింది. అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్‌ సురేష్‌ ఖైత్‌ తెలిపారు. అప్పటి వరకు తీర్పుని రిజర్వ్ చేశారు..

కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు.

ఉద్దేశపూర్వకంగానే దోషులు ఉరిశిక్ష అమలు ఆలస్యం చేసేందుకు యత్నిస్తున్నారని

చెప్పారు. కావాలనే లెక్కలు వేసుకుని మరీ పిటిషన్లు వేస్తూ దేశం సహనాన్ని పరీక్షిస్తున్నారని పేర్కొన్నారు. నిర్భయపై ఆ నలుగురు అమానవీయంగా వ్యవహరించిన దారుణం యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని గుర్తు చేశారు. పవన్‌ గుప్తా అనే దోషి ఇప్పటివరకు క్యురేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నాడని కోర్టుకు తెలిపారు.

మరోవైపు ఎప్పట్లాగే నిందితుల తరపున ఏపీ సింగ్ వాదనలు వినిపించారు. గత సుప్రీం తీర్పు, జైలు మాన్యువల్ ప్రకారం దోషులను విడివిడిగా ఉరి తీయడానికి వీల్లేదని ఆయన వాదించారు. మొత్తంగా నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

Tags

Read MoreRead Less
Next Story