Home
 / 
అంతర్జాతీయం / అమరావతి కోసం NRI లంతా...

అమరావతి కోసం NRI లంతా ఒక్కతాటిపైకి వచ్చేశారు..

అమరావతి కోసం NRI లంతా ఒక్కతాటిపైకి వచ్చేశారు..
X

48 రోజులుగా అమరావతి భగ్గుమంటోంది. 29 గ్రామాల్లోనూ ఉద్యమసెగలు ప్రజ్వరిల్లుతున్నాయి. వీరికి మద్దతుగా ఇప్పటికే రాష్ట్రమంతా కదలింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ అన్న తేడా లేకుండా అన్ని జిల్లాల ప్రజలు అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పుడు NRIల వంతు వచ్చింది. మేము సైతం అంటూ అమరావతి ఉద్యమానికి మద్దతుగా బరిలోకి దిగారు.

వన్ స్టేట్-వన్ కేపిటల్, సేవ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి రైతులను కాపాడండి-వాళ్ల త్యాగాలను గుర్తించండి. రాజధాని గ్రామాల్లో ఈ నినాదాలు ప్రతిరోజూ మార్మోగుతున్నాయి. ఇప్పుడివే నినాదాలు అమెరికాలోని న్యూయార్క్ విధుల్లోనూ హోరెత్తాయి. ఏపీకి చెందిన NRI లంతా ఒక్కతాటిపైకి వచ్చారు. అమరావతి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు..USలో స్థిరపడిన వివిధ తెలుగు సంఘాల నాయకులు, NRIలు న్యూయార్‌లో ఇండియన్ కాన్సులేట్ జనరల్‌ను కలిశారు..ఏపీలో జరుగుతున్న పరిణామాలను సమగ్రంగా వివరించారు. రాజధాని మార్పు, పోలీసులపై మహిళల దాడులు సహా అన్ని అంశాలనూ ప్రస్తావిస్తూ...వినతిపత్రం సమర్పించారు...కేంద్రం వెంటనే జోక్యం చేసుకునేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు...

ఏపీ అభివృద్ధిపైనా NRIలు ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు ఇన్వెస్టర్లు కూడా ఇండియన్ కాన్సులేట్ జనరల్‌ను కలిశారు..గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో డెవలప్‌మెంట్ మొత్తం ఆగిపోయిందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీ మీద నమ్మకమే పోతుందని చెప్పారు..NRIల విజ్ఞప్తిపై స్పందించిన ఇండియన్ కాన్సులేట్ జనరల్ .. విషయాన్ని రాష్ట్రపతితోపాటు.. ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు..

మొత్తానికి అమరావతి ఉద్యమం ఖండాంతరాలను దాటి విస్తరిస్తోంది. ఇప్పటికే సౌతాఫ్రికాలో స్థిరపడిన తెలుగువాళ్లు..రైతులకు సంపూర్ణ మద్దతు తెలిపారు..3 రాజధానుల ప్రయోగం విఫలమైందని స్పష్టం చేశారు. ఇక మిగతా దేశాల్లోని తెలుగు NRIలు కూడా ఒక్కొక్కరుగా కదులుతున్నారు. జై అమరావతి అంటూ నినదిస్తున్నారు.

Next Story