'సేవ్ అమరావతి' నినాదం రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నా పట్టించుకోని సర్కారు
BY TV5 Telugu3 Feb 2020 11:15 AM GMT

X
TV5 Telugu3 Feb 2020 11:15 AM GMT
సేవ్ అమరావతి నినాదం రాష్ట్రవ్యాప్తంగా గట్టిగా వినిపిస్తున్నా సర్కారు మొండిగానే ముందుకెళ్తోంది. 3 రాజధానులపై ముందుకే వెళ్తోంది. అమరావతికి మద్దతుగా అన్ని చోట్లా ర్యాలీలు, ఆందోళనలు జరుగుతున్నా కళ్లకు కనిపించనట్టే వ్యవహరిస్తోంది. ఈ పరిణామాలపై అమరావతికి భూములిచ్చిన 29 గ్రామాల రైతులు మండిపడుతున్నారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమ సహనం పరీక్షించొద్దని అంటున్నారు. రాజధాని గ్రామాల్లో ఎవర్ని కదిపినా ఉద్వేగానికి లోనవుతున్నారు. తమ భవిష్యత్‌తో ఆటలాడుతున్న సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. ఇన్నాళ్లు గడపదాటి బయటకు రాని మహిళలు సైతం నిరసన దీక్షల్లో కూర్చుంటున్నారు. పదిమందితో మాట్లాడాలంటేనే సిగ్గుపడేవాళ్లు కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తమ డిమాండ్‌లు వినిపిస్తున్నారు. రాజధానిగా అమరావతే ఉండాలని నినదిస్తున్నారు.
Next Story