కుక్కను బతికించిన డాక్టర్‌కి థాంక్స్ చెబుతూ ప్రకటన.. ఖర్చు రు.43 కోట్లు..

కుక్కను బతికించిన డాక్టర్‌కి థాంక్స్ చెబుతూ ప్రకటన.. ఖర్చు రు.43 కోట్లు..

ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే కృతజ్ఞతలు చెబుతాం. ఇంకా ఎక్కువగా చెప్పాలనిపిస్తే ఏదో ఒక బహుమతి ఇస్తాం. కానీ వాటన్నింటికీ విరుద్ధంగా ఓ ప్రకటన ఇచ్చి తన సంతోషాన్ని వెలిబుచ్చారు. కృతజ్ఞతల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంతకీ విషయం ఏంటంటే వెదర్‌టెక్ అనే కార్ల విడి భాగాల తయారీ సంస్థ సీఈవో డేవిడ్ మ్యాక్‌నైల్ గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్క స్కాట్‌ను పెంచుకుంటున్నారు.

స్కాట్ తీవ్ర అనారోగ్యానికి గురైంది. దాని శరీరంలో గడ్డ ఉందని, రక్తంలో క్యాన్సర్ కణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. వైద్యం చేయించినా బతికే అవకాశాలు చాలా తక్కువ అని డాక్టర్లు చెప్పారు. కానీ మ్యాక్‌నైల్ ఖరీదైన వైద్యం అందిస్తే స్కాట్ బతుకుతుందేమో అనే ఆశతో యూనివర్సిటీ ఆఫ్ విస్కోన్సిన్ స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్‌లో చేర్చారు. అక్కడ స్కాట్‌కి కీమో థెరఫీ, రేడియేషన్ థెరఫీ, ఇమ్యునోథెరఫీ ఇచ్చారు. దీంతో స్కాట్ క్యాన్సర్ గడ్డ 90 శాతం కరిగిపోయింది.

ఈ విషయం తెలియగాన్ మ్యాక్‌నైల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అప్పుడే ఆ డాక్టర్‌కి వినూత్నంగా థ్యాంక్స్ చెప్పాలనుకున్నారు. అమెరికాలోని సూపర్ బౌల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ప్రకటన కోసం 6 మిలియన్ డాలర్లు (రూ.42,93,63,000) వెచ్చించారు.

ఆ ప్రకటనలో కుక్కల్లో వచ్చే క్యాన్సర్ గురించి వివరిస్తూ దానికి వైద్యం అందించిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన తయారు చేయించారు. ఈ ప్రకటన ద్వారా తన కుక్కకు వైద్యం అందించిన వెటర్నరీ స్కూల్‌కు విరాళాలు లభించే అవకాశాలు ఉంటాయని మ్యాక్‌నైల్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story