4వేల ఎకరాలు అమ్మి నవరత్నాలు అమలు చేయడమేంటి?: బండారు సత్యన్నారాయణ

4వేల ఎకరాలు అమ్మి నవరత్నాలు అమలు చేయడమేంటి?: బండారు సత్యన్నారాయణ

విశాఖ జిల్లాలో 10వేల ఎకరాల భూమి సేకరణ వెనుక భారీ కుంభకోణం ఉందన్నారు మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి. లాండ్‌ పూలింగ్‌ని పేద ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే ప్రభుత్వం బలవంతంగా భూములను సేకరిస్తోందని విమర్శించారు. ఏపీ బిల్డ్‌ పేరుతో 4వేల ఎకరాల భూమిని అమ్మి నవరత్నాలు అమలు చేయడం ఏంటని ప్రశ్నించారు. శారదా పీఠంలో సీఎం జగన్‌ ఐదారు గంటలు ఉండడం వెనుక మతలబు ఏంటని అన్నారు. విశాఖలో భూములమ్మిన సొమ్ము ఏపీ బిల్డ్‌ కార్పొరేషన్‌కు తరలిస్తే దీక్షకు దిగుతామని బండారు సత్యన్నారాయణ మూర్తి అన్నారు.

Tags

Next Story