ఉప్పూడిలో అదుపులోకి వచ్చిన గ్యాస్ లీకేజీ
తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడిలో ONGC గ్యాస్ లీక్ అదుపులోకి వచ్చింది. మూడు రోజుల నుంచి ఎగిసిపడుతున్న గ్యాస్ లీక్‌ను ముంబై నుంచి వచ్చిన ONGC బృందం అదుపులోకి తీసుకువచ్చింది. ప్లాన్ బీ విధానం ద్వారం లీకేజీ ప్రాంతంతో భారీగా బురద నీటిని పంపించారు. గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చింది. దీంతో ఉప్పూడి వాసులు ఊపిరి పీల్చుకున్నారు. మరోసారి ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వరూప్ హామీ ఇచ్చారు.
మరోవైపు తరచూ గ్యాస్ లీకేజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి వాసులు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. వెంటనే ఇక్కడ నుంచి వీటిని తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్యాస్ లీకేజీలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం గుప్పిట్లో బతుకుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేవారు. అధికారులు సకాలంలో పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఉప్పూడి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com