దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై విచారణ వేగవంతం

దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టు నియమించిన జ్యుడిషయల్ కమిటీ విచారణను వేగవంతం చేసింది. హైదరాబాద్ చేరుకున్న జ్యుడిషయల్ కమిటీ మూడు రోజులపాటు విచారణ జరపనుంది. జ్యుడీషియల్ కమిటీలో మాజీ న్యాయమూర్తి సిర్పూర్ కర్, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖ ప్రకాష్ సభ్యులుగా ఉన్నారు. తొలిరోజు విచారణలో భాగంగా.. కమిషన్ ముందు అడిషనల్ డీజీ జితేందర్, సిట్ చీఫ్ మహేష్ భగవత్ హాజరయ్యారు. స్టేటస్ రిపోర్టును మహేష్ భగవత్ జ్యుడీషియల్ కమిటీ సభ్యులకు అందజేశారు.
షీల్డ్ కవర్లోని దిశ నిందితుల పోస్టుమార్టం, రీ పోస్టుమార్టం రిపోర్ట్ ను కూడా కమిషన్ పరిశీలించింది. తొలిరోజు రిపోర్టులను పరిశీలించిన కమిటీ తర్వాత రెండు రోజుల్లో ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసు సిబ్బందిని కమిషన్ విచారించనుంది. అలాగే నిందితుల కుటుంబ సభ్యులతో పాటు దిశ ఫ్యామిలీ మెంబెర్స్ యొక్క స్టేట్ మెంట్ ను కమిషన్ రికార్డ్ చేయనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com