బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీకి అరుదైన ఛాన్స్

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీకి అరుదైన ఛాన్స్

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీకి అరుదైన ఛాన్స్ వచ్చింది. ప్రతిష్టాత్మక టోక్యో ఒలిపింక్స్‌లో భారత క్రీడా బృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండే అవకాశం సౌరభ్‌కు దక్కింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం, గంగూలీకి ఆహ్వానం పంపింది. కోట్లాదిమందికి గంగూలీ స్ఫూర్తిగా నిలిచారని ఐఓఏ పేర్కొంది. బీసీసీఐ ఛైర్మన్‌గా యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించింది. భారత క్రీడా బృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా గంగూలీ ఉంటే క్రీడాకారులకు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుందని అభిప్రాయపడింది.

ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలిపింక్స్‌ జరగనునున్నాయి. ఈసారి జపాన్ రాజధాని టోక్యో విశ్వక్రీడలకు ఆతిథ్యమిస్తోంది. మనదేశం తరఫున దాదాపు 2 వందల మంది క్రీడాకారులు తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. 14 నుంచి 16 క్రీడాంశాల్లో వాళ్లు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ టీమ్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండాలంటూ గంగూలీని ఐఓఏ ఆహ్వానించిం ది. 2016 రియో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌, బీజింగ్‌ ఒలింపిక్ గోల్డ్‌ మెడలిస్ట్‌ అభినవ్‌ బింద్రా, బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్లుగా వ్యవహరించారు.

Tags

Read MoreRead Less
Next Story