క్రైమ్

భార్యను తుపాకీతో కాల్చేందుకు భర్త యత్నం..

భార్యను తుపాకీతో కాల్చేందుకు భర్త యత్నం..
X

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన ప్యాట శ్రీనివాస్‌ తన భార్య మౌనిక, మేనమామ రాజిరెడ్డిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో రాజిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటినా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీనివాస్‌ అతని భార్య మౌనిక మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో కొద్ది రోజులుగా మౌనిక తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇస్రాజ్‌ పల్లిలోని మేనమామ రాజిరెడ్డి ఇంట్లో ఉంటోంది. సోమవారం అర్థరాత్రి సమయంలో వచ్చిన శ్రీనివాస్‌ భార్యతో గొడవకు దిగాడు. తుపాకీతో భార్యను కాల్చేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో అడ్డువచ్చిన రాజిరెడ్డిపై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్న రాజిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.

Next Story

RELATED STORIES