కాలేజీ లెక్చరర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు

మహారాష్ట్రలోని వార్థాలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో ఓ మహిళా లెక్చరరుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు యువకుడు. వార్థా జిల్లాలోని నందోరి చౌక్‌లో వికేశ్ అనే యువకుడు నడిరోడ్డుపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికులు మంటలు ఆర్పి ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు పరిస్థితి విషమంగా ఉంది.
దడోరా గ్రామానికి చెందిన అంకిత అదే గ్రామానికి చెందిన వికేశ్‌తో కొంతకాలంగా పరిచయం ఉంది. పెళ్లి అయిన అతనికి భార్య, కొడుకు ఉన్నారు. అయినా అతడు యువతి వెంటపడి వేధిస్తున్నాడు. అతని ప్రవర్తన నచ్చక కొంత కాలంగా దూరం పెట్టింది. దీంతో కాలేజీ వద్ద కాపు కాసిన వికేశ్ .. అంకితతో ఘర్షణకు దిగాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోలు ఆమెపై చల్లి నిప్పంటించాడు. గమనించిన స్థానికులు మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు. అటు ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. సత్వర విచారణకు ఆదేశించింది. పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com