గ్యాస్‌ లీకేజీ దిగ్బంధంలో ఉప్పూడి గ్రామం.. ఫలించని రెస్క్యూ చర్యలు

గ్యాస్‌ లీకేజీ దిగ్బంధంలో ఉప్పూడి గ్రామం.. ఫలించని రెస్క్యూ చర్యలు

తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడిలో ONGC గ్యాస్ లీక్ ఇంకా అదుపులోకి రాలేదు. మూడు రోజుల నుంచి గ్యాస్‌ అంతకంతకు ఎగిసిపడుతోంది. దీంతో ఉప్పూడి గ్రామం గ్యాస్ లీకేజీ దిగ్బంధంలోనే కొట్టుమిట్టాడుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. స్థానిక ఓఎన్‌జీసీ అధికారులు దాన్ని కంట్రోల్‌ చేయలేకపోతున్నారు. దీంతో ఉప్పూడి గ్రామస్తులు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళనలో ఉన్నారు.

మొదటగా వాటర్‌ అంబ్రెల్లా ప్రక్రియ ద్వారా గ్యాస్‌ లీకేజీని అరికట్టేందుకు యత్నించారు. ఇది విఫలం కావడంతో.. ప్లాన్‌ బీ విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు ముంబై నుంచి ప్రత్యేక నిపుణుల బృంధాన్ని పిలిపించారు. గ్యాస్‌ లీకేజీని అరికట్టేందుకు రంగంలోకి దిగారు. ప్లాన్‌ బీ విధానంలో 40 వేల లీటర్ల బురదను పంపేలా చర్యలు తీసుకున్నారు. లీకేజీ అరికడతామని అధికారులు అంటున్నారు. మరోవైపు గ్యాస్‌ లీకేజీపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. అధికారులు సకాలంలో పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అల్టిమేటం జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story