శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగు కలకలం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగు కలకలం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఓ బ్యాగు భద్రతా సిబ్బందిని కలవరానికి గురిచేసింది. బ్యాగులో ఏముందోనని పోలీసులు ఉరుకులు, పరుగులు తీశారు. దాన్ని పరిశీలించిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కిలోన్నర పసిడిని గుర్తించి నోరెళ్లబెట్టారు. ఇంటర్నేషనల్‌ అరైవల్‌ బ్యాగేజ్‌ 5వ బెల్ట్‌ వద్ద ఓ అనుమానాస్పద బ్యాగులో 24 క్యారెట్ల బంగారం బయటపడింది. గుర్తు తెలియని ప్రయాణికుడు వదిలి వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story