వృద్ధ అంధురాలైన భార్య పింఛన్ రద్దు.. భర్త మృతి

ఎన్నో యేళ్లుగా అందుకుంటున్న వృద్ధాప్య పింఛను రద్దు ప్రాణాలు తీసింది. తన వృద్ధాప్య పింఛన్‌తో పాటు అంధురాలైన తన భార్యది తొలిగించారని మనోవేదనతో ఖాసింవలి అనే వ్యక్తి నడి రోడ్డుపై కుప్పకూలాడు. నడవలేని స్థితిలో ఎన్నిసార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పని కాకపోవడంతో తీవ్ర మనస్థాపంతో ప్రాణాలు విడిచాడు. ఈ హృదయవిదారక సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటు చేసుకుంది.

ఖాసింవలి అతని భార్య కాసింబిలకు గతంలో పింఛను వచ్చేది. వీరిద్దరు గత ప్రభుత్వాలు 200 రూపాయలు ఇచ్చేటప్పుడు నుంచి పింఛను పొందుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం పింఛన్‌ రద్దు చేయడంతో.. ఖాసిం వలి ఎమ్మార్వో ఆఫీస్‌కు మున్సిపల్‌ కార్యాలయానికి పలుమార్లు తిరిగాడు. అంధురాలైన తన భార్య పింఛను కూడా రద్దు చేశారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎంతకీ పనికాకపోవడంతో.. వయసు పైబడిన ఖాసింవలి తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు. ఎమ్మార్వో ఆఫీస్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తూ దారిలో కుప్పకూలిపోయాడు. దారిన పోయే వారు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Tags

Read MoreRead Less
Next Story