పల్నాడులో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

పల్నాడులో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

గుంటూరు జిల్లా పల్నాడులో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పిడుగురాళ్లకు చెందిన డాక్టర్ శేఖర్ బాబుపై కిరాతకంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఏమాత్రం కనికరం లేకుండా రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. తీవ్రగాయాలతో బాధపడుతున్న శేఖర్ బాబును చూసిన స్థానికులు.. ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.

దాడిపై ఫిర్యాదు చేసినా పిడుగురాళ్ల పోలీసులు స్పందించలేదు. విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో పులువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మట్టారెడ్డి, సతీష్ రెడ్డి, ఫకీరా రెడ్డి, సత్తార్ సీతారామిరెడ్డి, హరిప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిలో సతీష్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గన్ మెన్ అని తెలుస్తోంది.

Tags

Next Story