ఎయిర్ ఇండియా ఉద్యోగులకు బంపర్ ఆఫర్

ఎయిర్ ఇండియా ఉద్యోగులకు బంపర్ ఆఫర్

ఎయిర్ ఇండియా ఉద్యోగులకు బంపర్ ఆఫర్. ఏకంగా వారం రోజుల పాటు సెలవులు వచ్చాయి. కంపెనీ యాజమాన్యమే స్వయంగా లీవ్ మంజూరు చేసింది. ఆపత్కాలంలో అరుదైన సేవలు అందించారంటూ సిబ్బందిని ప్రశంసించింది. ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రజలను కాపాడారని కితాబిచ్చింది. ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించారంటూ వారం రోజుల పాటు సెలవులు ఇచ్చింది.

ఎయిర్ ఇండియా ఉద్యోగులకు లీవ్స్ ఇవ్వడం వెనక ఆసక్తికరమైన కారణం ఉంది. చైనాలోని వూహాన్‌ నుంచి భారతీయులను తీసుకురావడంలో ఎయిర్ ఇండియా కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం చైనాను చూసి ప్రపంచమే వణుకుతోంది. చైనా నుంచి వచ్చినవాళ్లంటేనే దూరంగా పెడుతున్నారు. అస్సలు చైనాకు వెళ్లొద్దు అంటూ ఆంక్షలు విధిస్తున్నారు. ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లోనూ ఎయి ర్ ఇండియా ఉద్యోగులు తమ కర్తవ్య నిర్వహణను మరిచిపోలేదు. వూహాన్‌ నుంచి భారతీయ విద్యార్థులు, పర్యాటకులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేక విమానాల్లో వెళ్లారు. రెండు విమానాల్లో దాదాపు 7 వందల మందిని స్వదేశానికి తీసుకువచ్చారు.

కరోనా వైరస్ భయంకరంగా కాటేస్తున్న టైమ్‌లో చైనాకు వెళ్లడం ఆషామాషీ విషయం కాదు. అందుకే, భయంకరమైన పరిస్థితుల్లో చైనాకు వెళ్లిన ఉద్యోగులకు ఎయిర్ ఇండియా యాజమాన్యం నజరాన ప్రకటించింది. 30 మంది కేబిన్ క్రూ, 8 మంది పైలట్లు, 10 మంది కమర్షియల్ ఉద్యోగులతో పాటు మొత్తం 64 మందికి సెలవులు మంజూరు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story