రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోనిది: కేంద్రమంత్రి

రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోనిది: కేంద్రమంత్రి
X

ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభలో ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ సమాధానం ఇచ్చారు. 2015లోనే అమరావతిని రాజధానిగా నోటిఫై చేశారని సభలో వెల్లడించారు. అమరావతిని నోటిఫై చేస్తూ 2015 ఏప్రిల్‌ 23న రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందని తెలిపారు. మూడు రాజధానుల విషయం మీడియా ద్వారానే తెలిసిందని.. రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని ఆయన వెల్లడించారు. ఇంతకూ కేంద్రం అమరావతికి అనుకూలమా..? కేంద్ర మంత్రి ప్రకటన కూడా ఇదే చెబుతోందా..? అమరావతిని నోటిఫై చేయలేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనకు కేంద్రం చెక్‌ పెట్టినట్లేనా..? అనే అంశాలపై స్పష్టత రావల్సి ఉంది.

Tags

Next Story