వైసీపీ ప్రభుత్వం అమరావతిని సర్వనాశనం చేసింది : చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం అమరావతిని సర్వనాశనం చేసింది : చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం అమరావతిని సర్వనాశనం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతుల ఉద్యమం 50వ రోజుకు చేరడంతో.. దీక్షలో కూర్చున్న రైతులను, మహిళలను చంద్రబాబు మరోసారి పరామర్శించారు. వారికి టీడీపీ అన్ని విధలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తమను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు దగ్గర కన్నీటి పర్యంతమయ్యారు రైతులు, మహిళలు. ప్రభుత్వం తమను మోసం చేసిందని రాయపూడి రైతులు చంద్రబాబు దగ్గర మొరపెట్టుకున్నారు..

అమరావతిని శ్మశానం, ఎడారి అంటూ వైసీపీ చేసిన విమర్శలను చంద్రబాబు తప్పు పట్టారు. అమరావతి ముంపు ప్రాంతం కాదని, వైసీపీ ప్రభుత్వం వచ్చాకే అమరావతికి ముంపు వచ్చిందన్నారు. ప్రభుత్వాలు చట్టాలు అమలు చేయాలి కాని ఉల్లంఘించకూడదన్నారు. రాజధాని కోసం 39 మంది రైతులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు.

Tags

Next Story