పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్దించిన తలైవా

పౌరసత్వ సవరణ చట్టాన్ని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సమర్దించారు. సీఏఏతో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. భారత పౌరులకు ఎలాంటి సమస్యలు ఉండబోవని భారత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. విభజన తర్వా త భారత్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్న ముస్లింలను దేశం నుంచి పంపిస్తారని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. కొన్ని పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. ఒకవేళ, సీఏఏతో ముస్లింలకు ఏదైనా ము ప్పు ఏర్పడితే వారి తరఫున నిలబడే మొదటి వ్యక్తిని తానే అవుతానన్నారు.
NPR, NRCల పైనా రజనీకాంత్ స్పందించారు. జాతీయ జనాభా పట్టిక రూపకల్పన చాలా అవసరమని రజనీకాంత్ స్పష్టం చేశారు. బయటి వ్యక్తులను గుర్తించడానికి NPR చాలా ముఖ్యమైందన్నారు. NRC గురించి ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. NRCపై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదని కేంద్రం కూడా చెప్పిందని రజనీకాంత్ గుర్తు చేశారు. సీఏఏపై రజనీ నేరుగా స్పందించడం ఇదే మొదటిసారి. గత డిసెంబర్‌లో సీఏఏపై పరోక్షంగా మాట్లాడిన తలైవా, హింసాత్మక ఘటనలతో సమస్య పరిష్కారం కాదన్నారు. భారతీయులంతా ఐకమత్యంగా ఉండాలని సూచించారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com