సిఎఎ వల్ల ముస్లింలకు ఎటువంటి ముప్పు లేదు : రజినీకాంత్

సిఎఎ వల్ల ముస్లింలకు ఎటువంటి ముప్పు లేదని.. ఎన్‌పిఆర్ అవసరమని సినీనటుడు రజినీకాంత్ పేర్కొన్నారు.
అయితే ఈ అంశాలపై తమిళనాడులో ఉద్దేశపూర్వకంగా రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఫైర్ అయ్యారు రజిని. చెన్నైలోని పోయెస్ గార్డెన్ తన నివాసంలో మాట్లాడిన రజిని.. దేశంలో ముస్లింలకు ఏమైనా ముప్పు వస్తే తాను మొదటగా స్వరం వినిపిస్తానని హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీలు తమ రాజకీయ లాభం కోసం సిఎఎపై భయాన్ని కలిగిస్తున్నాయని.. వారికి మత పెద్దలు కూడా తోడయ్యారు.. ఇది తప్పని వ్యాఖ్యానించారు.
దేశ విభజన సమయంలో చాలా మంది ముస్లింలు భారత్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నారని.. చావైనా బ్రతుకైనా వారు భారత్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నారని గుర్తుచేశారు. సిఎఎ కి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలిపే ముందు.. దీనిపై లోతుగా విశ్లేషించాలి అని సూచించారు. నిరసన తెలిపేముందు ప్రొఫెసర్లు లేదా పెద్దలతో సంప్రదించాలని కోరారు. మరోవైపు ఇక తూత్తుకుడిలో హింసకు సంబంధించి సమన్లపై కూడా వివరణ ఇచ్చారు రజిని.. తనకు ఇప్పటివరకు నోటీసు రాలేదని.. వస్తే ఖచ్చితంగా పూర్తి సహకారాన్ని అందిస్తానన్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com