నాగార్జున యూనివర్శిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం

నాగార్జున యూనివర్శిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం

నాగార్జున యూనివర్శిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు - పోలీసులకు మధ్య తోపులాటతో టెన్షన్‌ వాతావరణం కనిపించింది. యూనివర్శిటీలో మూడు రాజధానుల పేరుతో సెమినార్‌ ఏర్పాటు చేశారు. ఆ సెమీనార్‌ను అడ్డుకునేందుకు టీఎన్‌ఎస్‌ఎఫ్‌, దళిత విద్యార్థి సంఘాలు పిలిపు ఇచ్చాయి. దీంతో భారీగా విద్యార్థులు అక్కడకు చేరుకున్నారు.. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థుల చొక్కాలు చింపి.. వారిని బలవంతంగా రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. విద్యార్థి నేతలకు స్వల్పంగా గాయాలయ్యాయి. పోలీసుల చర్యలను స్టూడెంట్ యూనియన్స్‌ ఖండించాయి.

Tags

Next Story