రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..

అందం అమ్మాయి అయితే అచ్చం నీలాగే ఉంటుంది అని ఓ సినీ గేయ రచయిత రాసినట్టుగానే ప్రముఖ చిత్రకారుడు రవివర్మ గీసిన చిత్రాల మాదిరిగానే తారామణులను తన కెమెరా కంటితో చూపించారు. అచ్చంగా పెయింటింగ్ మాదిరిగానే వెండితెర వేల్పులను అలంకరించి క్లిక్‌మనిపించారు. ఐడియా అదరహో అనిపించేలా ఉన్నాయి ఫొటోలు. ఈ ఫొటో షూట్‌లో సమంత, మంచు లక్ష్మి, రమ్యకృష్ణ, శృతీహాసన్, ఐశ్వర్యా రాజేష్, ఖుష్బూ పాల్గొన్నారు. ప్రముఖ నటి సుహాసినీ మణిరత్నం స్థాపించిన 'నామ్' స్వచ్ఛంద సంస్థ కోసం ఓ క్యాలెండర్‌ను వినూత్నంగా డిజైన్ చేశారు. చెన్నైకి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ వెంకట్ రామ్ ఈ ఫొటోలను తీశారు. ప్రపంచాన్ని అందంగా చూసినప్పుడే అందమైన ఫొటోలను తీయగలుగుతాము అని అంటారు ఆయన.

Tags

Read MoreRead Less
Next Story