కియా పరిశ్రమ ఎక్కడకీ వెళ్లటం లేదు: బుగ్గన రాజేంద్రనాథ్
By - TV5 Telugu |6 Feb 2020 5:51 PM GMT
కియా పరిశ్రమ తరలింపు వార్తలను ఏపీ సర్కార్ ఖండించింది. కంపెనీ అధికారులతో వ్యక్తిగతంగా మాట్లాడానన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. రాయ్‌టర్స్ వార్తా కథనం వాస్తవం కాదన్నారు. పరిశ్రమ ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. కియా పరిశ్రమకు అడిగినవన్నీ ఇస్తున్నామని.. వాళ్లు సంతృప్తితో ఉన్నారన్నారు. ఓర్చు కోలేక కొంతమంది ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తున్నారని.. తాజాగా విశాఖపట్నం నుంచి మరో కంపెనీ తరలిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందన్నారు. ఆ వార్త కూడా తప్పేనన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలపై చర్యలు తీసుకోవలసిన సమయమిదన్నారు. తమ ప్రభుత్వం చేయాల్సినవి చేస్తుందని.. గత టీడీపీ ప్రభుత్వంలా అనవసర ప్రచారం చేసుకోవడం లేదన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com