జగన్‌కు దమ్ముంటే రాజధాని గ్రామాలకు రావాలి : చంద్రబాబు

జగన్‌కు దమ్ముంటే రాజధాని గ్రామాలకు రావాలి : చంద్రబాబు

సీఎం జగన్‌కు దమ్ముంటే రాజధాని గ్రామాలకు రావాలని సవాల్ విసిరారు చంద్రబాబు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ఓవైపు ఉంటే జగన్‌ ఒక్కడే ఒక వైపు ఉన్నాడని అన్నారు. ఆయన తిక్క కుదిరే వరకు వదలిపెట్టమని హెచ్చరించారు. అమరావతి ఉద్యమంలో 39 మంది చనిపోయారని అవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. గాలికి వచ్చిన వైసీపీ ప్రభుత్వం...మళ్లీ గాలికే పోతుందని స్పష్టం చేశారు..అమరావతి కోసం రైతులు చేస్తున్న ఉద్యమం 50 రోజులకు చేరడంతో రాజధాని గ్రామాల్లో పర్యటించారు చంద్రబాబు. రాయపూడి, తుళ్లూరు, పెదపరిమి, తాడికొండలో రైతుల దీక్షలకు సంఘీభావం తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story