తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న కరోనా వైరస్

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న కరోనా వైరస్

తెలుగు రాష్ట్రాలను కూడా కరోనా వైరస్‌ భయపెడుతోంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ సాధారణ జ్వరం, జలుబు లక్షణాలు కన్పిస్తే చాలు కరోనా అని భయపడుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చైనాకు వెళ్లి వచ్చిన వారిలో హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండటంతో కరోనా భయం వెంటాడుతోంది. బుధవారం గాంధీ ఆస్పత్రిలో ఐదు కరోనా అనుమానిత కేసులు నమోదు కాగా, ఫీవర్‌ ఆస్పత్రిలో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్క హైదరాబాద్‌లోనే అనుమానిత కేసులు 9కి చేరింది.

చైనా నుంచి వచ్చిన షాపూర్‌నగర్‌కు చెందిన 29 ఏళ్ల మహిళ, 24 ఆమె సోదరి, కొచ్చిన్‌ నుంచి వచ్చిన బొల్లారానికి చెందిన 20 ఏళ్ల యువతి, షాంగై నుంచి వచ్చిన 28 ఏళ్ల ఖమ్మం జిల్లావాసి, వియత్నాం నుంచి వచ్చిన 60 ఏళ్ల మౌలాలివాసి గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. బీజింగ్‌ నుంచి వచ్చిన గచ్చిబౌలికి చెందిన ఇద్దరు యువకులు, ఖమ్మం జిల్లాకు చెందిన 32 ఏళ్ల యువకుడు, కంచన్‌బాగ్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడ్ని నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వీరి నుంచి నమూనాలు సేకరించి గాంధీ వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

గురువారంవీరందరికీ సంబంధించి వ్యాధి నిర్ధారణ పరీక్షల రిపోర్ట్‌లు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తొమ్మిది అనుమానిత కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే నాలుగు నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. మరో ఐదు రిపోర్టులు రావాల్సి ఉంది. ఇక ఫీవర్‌ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 25 అనుమానిత కేసులు నమోదు కాగా, వీరిలో 21 మందిలో నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. మరో నాలుగు రిపోర్టులు రావాల్సి ఉంది.

కరోనా వ్యాధికి సంబంధించిన వదంతులు నమ్మొదని తెలంగాణ ప్రభుత్వం సూచిచింది. రాష్ట్రంలో ఇప్ప టివరకు ఒక్కకేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.

Tags

Next Story