చైనాలో ఆ మరణాల సంఖ్య దాటిన 'కరోనా' మహమ్మారి..

చైనాలో కరోనావైరస్ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో 490 మంది మరణించారు. గత 11 రోజులలో కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ వైరస్ తగ్గుతుందన్న ఆశలు కూడా చైనా ప్రభుత్వానికి లేకుండా పోయాయి. దీంతో ఆ దేశ ప్రభుత్వం దీనిపై తీవ్రంగా ఆందోళన చెందుతోంది. చైనాలో ప్రధాన భూభాగంలో 2002-3లో సంభవించిన తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ , SARS అంటువ్యాధిలో ఎక్కువ మంది మరణించారు..
ఆ సమయంలో సుమారు 349 మంది మరణించారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువమంది అంటే ఏకంగా 490 మంది మరణించడం ఆందోళనకు గురిచేసే అంశమనే చెప్పాలి. చైనా ఆరోగ్య కమిషన్ బుధవారం కొత్త గణాంకాలు వెల్లడించింది. ఒక్క మంగళవారంలోనే 65 మంది మరణించారని , అలాగే 3,887 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ఇప్పటివరకు, 24,324 మందికి వ్యాధి సోకినట్లు స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com