పుట్టినరోజుకి పుచ్చకాయ గిప్టా.. నీకేమైనా పిచ్చా!!

పుట్టినరోజుకి పుచ్చకాయ గిప్టా.. నీకేమైనా పిచ్చా!!

అవునండీ.. అవును.. పుచ్చకాయ కాకపోతే ద్రాక్షపండు పోనీ స్ట్రాబెర్రీ. మరి ఇక్కడ లాగ పండు రేటు పదో, వందో కాదు వేలు, లక్షలు ఉంటాయి. అందుకే అక్కడ పండ్లే బహుమతులు. నిజంగానే జపాన్‌లో పండ్ల ధరలు ఇలా వేలల్లోనూ, లక్షల్లోనూ ఉంటాయి. అందుకే అవి కానుకలయ్యాయి. పండ్లు ఇవ్వడాన్ని తమ సంస్కృతిలో భాగంగా భావిస్తారు జపనీయులు. పుచ్చకాయ హార్ట్ షేప్‌లో ఉండి మనసు దోచేస్తుంది. ద్రాక్షపండ్లు చిన్నసైజు టమాటాల్లా ఎర్రగా అందంగా ఉండి నోరూరిస్తుంటాయి. స్ట్రాబెర్రీలు టెన్నిస్ బాల్ సైజులో చూడచక్కగా ఉంటాయి. అందుకే వాటిని బాక్పుల్లో పెట్టి బంగారు ఆభరణాల్లా అందిస్తారు. ఎరువేస్తే ఏపుగా పెరుగుతుందనుకుంటే పొరపాటే. జపనీయులు పండ్లను పండించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పండ్లను వివిధ ఆకృతుల్లో పండించడానికి ఎంతో కష్టపడతారు. మందులతో కూడిన ఎరువులు వేయకుండా సేంద్రియ పద్ధతిలో పంట పండిస్తారు. తమ హోదాని తెలియజేయడానికి బహుమతులు ఇవ్వాల్సి వస్తే పండ్లను ఎంచుకుంటారు వారు. అందుకే అంత రేటు. తమ కానుక ఎంత విలువైందో తెలియజేయడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి మరీ కొంటారు. వాటిని అందమైన బాక్సుల్లో పెట్టి మరీ అందిస్తారు. ఆభరణాలకంటే విలువైన పండుకే మొదటి ప్రాధాన్యం. బహుమతి అందుకున్న వారు మర్నాడు ఫోన్ చేసి మీ గిప్ట్ ఎంతో స్వీట్‌గా ఉందంటే పొంగిపోతారు. ఈసారి ఫంక్షన్‌కి వెళ్లేటప్పుడు అంతకంటే విలువైన పండుని తీసుకువెళ్లాలని అప్పుడే ప్లాన్ చేసుకుంటారు.

Tags

Read MoreRead Less
Next Story