నెల్లూరు కోర్టు సంచలన తీర్పు.. తల్లీకూతురు హత్య కేసులో దోషికి ఉరిశిక్ష
నెల్లూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.. తల్లీకూతురుని హత్య చేసిన కేసులో దోషికి ఉరిశిక్ష ఖరారు చేసింది. 2013 ఫిబ్రవరి 12న నెల్లూరు హరినాథపురంలో తల్లీకూతుళ్ల హత్య సంచలనం సృష్టించింది. మెడికో భార్గవి, ఆమె తల్లి శకుంతలను హత్య చేశాడు ఇంతియాజ్. అతడికి మరో ఇద్దరు సహకరించారు. అయితే వీళ్లద్దరూ మైనర్లు కావడంతో గతంలోనే 3 ఏళ్లు శిక్ష విధించింది కోర్టు. ప్రధాన దోషి ఇంతియాజ్‌కు ఈ రోజు మరణశిక్ష ఖరారు చేస్తూ 8వ అదనపు జడ్జి తీర్పు వెల్లడించింది..
ఇంటీరియర్ డెకరేషన్ చేస్తామంటూ ఇంట్లోకి వచ్చిన ముగ్గురు దోపిడీకి ప్రయత్నించారు. అడ్డొచ్చిన భార్గవి, ఆమె తల్లి శకుంతలను చంపేశారు.. నిందితుల్ని అక్కడికక్కడే పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు..అప్పట్లో ఈ జంట హత్యల కేసు సంచలనం సృష్టించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com