రైల్వే బ‌డ్జెట్.. దక్షిణ మధ్య రైల్వేకు రూ. 6846 కోట్లు

రైల్వే బ‌డ్జెట్.. దక్షిణ మధ్య రైల్వేకు రూ. 6846 కోట్లు

కేంద్రం ప్రవేశ పెట్టిన రైల్వే బ‌డ్జెట్ ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకు ఈ ఏడాది 6846 కోట్ల నిధులు కేటాయించింది. ఇది గ‌త ఏడాది కంటే 30 శాతం అద‌నం. ఈ ఏడాది కూడా కొత్త ప్రాజెక్టుల కంటే ఇప్ప‌టికే కేటాయించిన ప్రాజెక్టుల‌కే పెద్ద పీఠ వేసింది. ఇందులో ప్రముఖ‌మైన‌ది రైల్వే ప‌ట్టాల వెంట రైల్వే స్థలంలో భారీ సోల‌ర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టడం. ఇక రైల్వే స్టేష‌న్ల అభివృద్ది కోసం పీపీపీ మూడ్ లో చేప‌ట్టే ప్రాజెక్టుపై దృష్టి సారించారు అధికారులు. ఇన్ఫ్రా స్ట్రక్షర్ అభివృద్ది కోసం 6,846 కోట్లు, కొత్త లైన్ల కోసం 2,856 కోట్ల గ్రాంట్, డ‌బ్లింగ్ , త్రిప్లింగ్, బైపాస్ లైన్ల కోసం 3,836 కోట్లు, ట్రాఫిక్ ఫెలిసిటీస్ కోసం 154 కోట్లు కేటాయింపులు చేసింది రైల్వే శాఖ‌.

ధర్మవరం.. పాకాల.. కాట్పడి మధ్య 290కి.మీ డబ్లింగ్ కోసం 2900కోట్లు, ప్రయాణికుల సౌక‌ర్యం కోసం ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో ప‌లు డ‌బ్లింగ్ ప‌నుల‌ను కొత్తగా నిధులు కేటాయించింది కేంద్రం. ఇందులో భాగంగా గుంటూరు.. బీబీనగర్ మధ్య 248కి.మీ డబ్లింగ్ కోసం 2480కోట్లు, అకోలా .. డోన్ ల మధ్య 626కి.మీ డబ్లింగ్ కోసం 6260కోట్లు, రోడ్ సేఫ్టి వర్క్ కోసం 542కోట్ల గ్రాంట్, ప్రయాణికుల సౌక‌ర్యాల కోసం 672 కోట్లు, ట్రైన్ కొలిష‌న్ అవైడెన్స్ సిస్టం ప్రాజెక్టు కోసం 100కోట్లు, ట్ర‌క్ రెన్యువ‌ల్ కోసం 900 కోట్ల గ్రాంట్ ను విడుద‌ల చేసింది .

అక్కన్నపేట్ .. మెదక్ ల మ‌ధ్య 17కి.మీ దూరం నిర్మాణంలో ఉన్నప్రాజెక్టు కోసం కోసం 54కోట్లు, ఈ ప్రాజెక్టులో యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భ‌రించాల్సి ఉంటుంది. 2012-13 లో అనుమ‌తులు వ‌చ్చిన ముద్ ఖేడ్..ప‌ర్భని 81 కి.మీ లైన్ కోసం ఈ ఏడాది 75 కోట్లు, 2012-13 లో అనుమ‌తులు వ‌చ్చిన‌ ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కోసం 40కోట్లు కేటాయించింది.. ఘ‌ట్ కేసర్ లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉంద‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జీఎం గ‌జాన‌న్ మాల్య తెలిపారు. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులైన‌ మనోహరాబాద్ - కొత్త పల్లిల మధ్య 151కి.మీ కొత్త ప్రాజెక్టు కోసం 235కోట్లు, మునీరాబాద్ - మహబూబ్ నగర్ ల మధ్య 243 కి.మీ కొత్త ప్రాజెక్టు కోసం 240కోట్లు, భధ్రాచలం - సత్తుపల్లి మధ్య 54 కి.మీ కొత్త లైన్ కోసం 529కోట్లు, కాజీపేట - బల్లహర్ష 3వ లైన్ కోసం 483 కోట్లు, నడికుడి- శ్రీకాళహస్తి మధ్య 309కి.మీ డబ్లింగ్ లైన్ కోసం 1198 కోట్లు, గుంటూరు -గుంతకల్ ల మధ్య 401కి.మీ పనుల కోసం 294కోట్లు కేటాయించారు.

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో విధ్యుదీక‌ర‌ణ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ ఏడాది కూడా భారీగా నిదులు కేటాయించింది రైల్వే శాఖ‌. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఎలక్ట్రిఫికేషన్ కోసం 178కోట్లు కేటాయించిన రైల్వే శాఖ.. చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ కోసం 5 కోట్లు, కర్నూలు లో నిర్మిస్తున్న మిడ్లైఫ్ రీహాబిలిటేషన్ ఫ్యాక్టరీ కోసం 30కోట్లు, తిరుచానూరు.. తిరుపతి రైల్వే స్టేషన్లు అభివృద్ధి కోసం 11కోట్లు.. 6 కోట్ల కేటాయింపులు చేసిన‌ట్టు గ‌జాన‌న్ మాళ్య‌. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే మ‌రిన్ని ప్రాజెక్టులు ప్రారంభించేందుకు రైల్వే సిద్దంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో స‌హ‌కారం లేక పోవ‌డంతోనే ఈ ప్రాజెక్టులు ఆల‌స్యం కావడంతో పాటు , క‌నీసం ప్రారంభించ లేక పోతున్నామ‌ని తెలిపింది రైల్వే శాఖ‌.

Tags

Read MoreRead Less
Next Story