ఆర్‌బీఐ నిర్ణయంతో రియాల్టీ రంగానికి పెద్ద రిలీఫ్

X
By - TV5 Telugu |6 Feb 2020 8:40 PM IST
కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన ఆర్‌బీఐ మానిటరీ పాలసీలో 6-0 ఓట్లతో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రెపో రేటు 5.15 శాతం, రివర్స్ రెపో 4.90 శాతం, బ్యాంక్ రేట్ 5.40 శాతం, సీఆర్‌ఆర్ 4 శాతం, ఎస్‌ఎల్‌ఆర్ 18.25 శాతంగా ఉన్నాయి. ఇక భవిష్యత్‌లో జరిగే సమావేశాల్లో వడ్డీరేట్లను తగ్గించే నిర్ణయాలు ఉంటాయని ఆర్‌బీఐ సంకేతాలు ఇచ్చింది. ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద రిలీఫ్ లభించనట్లయింది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి జీడీపీ వృద్ధిరేటు 6శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com