నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు దుమారం

నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు దుమారం

ఎన్నో ఏళ్లుగా నిజామాబాద్‌ రైతులు పసుపుబోర్డు కోసం ఎదురు చూస్తున్నారు. రైతులు అనేక పోరాటాలు చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గంలో ఏకంగా 176 మంది రైతులు పోటీ చేసి పసుపుబోర్డు పోరాటంపై జాతీయ స్థాయిలో చర్చించేలా పోరాడారు. కానీ చివరికి కేంద్రం ఇక్కడ మసాల దినుసుల ప్రాంతీయ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బోర్డు కేవలం మసాల దినుసులే కాకుండా పసుపు కోసం కూడా పనిచేస్తుందని కేంద్రం చెబుతోంది.

అయితే..సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు ప్రకటనపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలు సంబరాలు చేస్తుండగా టీఆర్ఎస్ మాత్రం విమర్శలు కురిపిస్తోంది. దశాబ్దాల పోరాట ఫలితంగానే బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ చెబుతున్నా..బోర్డు ఏర్పాటులో తిరకాసు ఉందంటూ మళ్లీ రాజకీయ దుమారం చెలరేగుతోంది. స్పైసెస్ పేరుతో రాజుకున్న రాజకీయం మరింత స్పైసీగా మారుతోంది. అసలు తాము అడిగింది పసుపు బోర్డు అయితే..స్సైసెస్ రీజినల్ బోర్డు ఎందుకంటూ ప్రశ్నిస్తోంది టీఆర్ఎస్.

నిజానికి తెలంగాణలో ఇప్పటికే స్పెసెస్ బోర్డు ఉంది. ఇటు డివిజినల్ స్పైసెస్ బోర్డును రీజినల్ స్పెసెస్ బోర్డుగా అప్ గ్రేడ్ మాత్రమే జరిగిందన్నది టీఆర్ఎస్ ఎంపీల వాదన. అంతకుమించి ఈ బోర్డుతో ఒరిగేదేమి లేదంటున్నారు. అటు జనాల్లోనూ స్సెసెస్ బోర్డు విషయంలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు కేంద్రం ప్రకటనను స్వాగతిస్తున్నారు. అయితే..రైతులు మాత్రం కేంద్రంపై ఫైర్ అవుతున్నారు. దశాబ్దాలుగా పసుపుబోర్డు కోసం పోరాడుతున్నామని.. తమకు స్పైసెస్ బోర్డుతో ఎలాంటి ఉపయోగం లేదని తేల్చిచెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story